Saturday, November 23, 2024

జొమాటో సంచలనం.. 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ

జొమాటో సంచలన ప్రకటన చేసింది. ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ చేసేందుకు సిద్ధమని తెలిపింది. జెఎ్టో తరహాలోనే ఫుడ్‌ డెలివరీ చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. ఇందు కోసం జొమాటో ఇన్‌స్టంట్‌ను త్వరలో ప్రారంభిస్తామని, పైలట్‌ ప్రాజెక్టుగా వచ్చే నెల నుంచి గురుగ్రామ్‌లోని నాలుగు స్టేషన్స్‌లో సేవలు అందిస్తామని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ సోమవారం వివరించారు. 10 నిమిషాల్లో ఏ కంపెనీ ఫుడ్‌ను డెలివరీ చేయలేదని, ప్రపంచంలోనే తొలి కంపెనీగా జొమాటో నిలుస్తుందని గోయల్‌ చెప్పుకొచ్చారు.

కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, దీని కోసం జొమాటో ఇన్‌స్టంట్‌ ప్లాట్‌ఫాంను సిద్ధం చేశామన్నారు. దీని కోసం రెస్టారెంట్లను క్రమబద్దీకరిస్తామని, సదరు ప్రాంతంలో ఎక్కువగా తినే ఆహార పదార్థాలను తెలుసుకుని లిస్టు చేస్తామని, దీంతో 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెప్పుకొచ్చారు. డెలివరీ చార్జీలు కూడా తగ్గుతాయని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement