Tuesday, November 26, 2024

ఐపీఓ కి సిద్ధమవుతున్న జొమాటో

ఇండియన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో ప్రైవేటు ఐపీవోదిశగా అడుగులువేస్తోంది. 650 మిలియన్
డాలర్ల సేకరణ లక్ష్యంతో వచ్చే నెల ఏప్రిల్ లో ఐపీవో
ప్రతిపాదనలు దాఖలు చేసేందుకు కంపెనీ ప్రణాళికలు
సిద్ధం చేసుకుంటోందని ఈ వ్యవహారంతో సంబంధము
న్న వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ చివరి నాటికి
లిస్టింగ్ ను పూర్తి చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.సంప్రదింపులు జరుగు తున్నాయి.

ఆఫరింగ్ పరిమాణం, తేదీలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అయితే జామాటోకు చెందిన ప్రతినిధి ఈ రిపోర్టులపై స్పందించేందుకు నిరాకరించా రు. కాగా 2008లో జొమాటోను న్యూఢిల్లీలో స్థాపించారు. 5 వేలకుపైగా మంది ఉపాధి
పొందుతున్నారని జొమాటో వెబ్ సైట్ గణాంకాలు చెబుతున్నాయి.

కాగా ఇటీవలే కోరా మేనేజ్ మెంట్, ఫిడెలిటీ మేనేజ్మెంట్ అండ్
రీసెర్చ్ కంపెనీల నుంచి 250 మిలియన్డాలర్ల వరకు నిధులను సేకరించింది. ఫిబ్రవరిలో ఇన్పో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్
ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. జొమాటో ప్రస్తుత వ్యాల్యూయేషన్ 5.4 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా నేపథ్యంలో దేశీయంగా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలకు డిమాండ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో ఐపీవో లిస్టింగ్ కు జొమాటో సమాయత్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement