Tuesday, November 19, 2024

మహానటి…!! ఏ పాపం తెలియదంటున్న జోమాటో డెలివరీ బాయ్

జోమాటో డెలివరీ బాయ్ తన పై దాడి చేశాడంటూ ఓ మహిళా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జోమాటో యాజమాన్యం.. ఆమెకు క్షమాపణలు కూడాచెప్పింది. దాడులను తాము సహించమని, సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిందితుడిపై చర్యలు కూడా తీసుకుంది.. వైద్య ఖర్చులు కూడా భరిస్తామని తెలిపింది. అయితే, ఈ కేసులు ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది. మహిళే తన ముక్కుపై తన ఉంగరంతోనే కొట్టికున్నట్టు చెబుతున్నాడు జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్. సదరు మహిళ హితేషా చంద్రనీ.. నన్ను బానిస అంటూ పిలిచింది.. ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. దాడి చేసింది. దీంతో.. ఆర్డర్ క్యాన్సిల్ చేశాను. కానీ, ఆ మహిళ.. ఫుడ్‌ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఆమె అపార్ట్మెంట్ తలుపు వద్దకు చేరుకుని.. ఆమెకు ఫుడ్ అందించాను.. ట్రాఫిక్ మరియు రోడ్లు బాగా లేనందున డెలివరీ కాస్త ఆలస్యం అయ్యిందని చెప్పా.. క్షమాపణలు కూడా చెప్పాను. కానీ, ఆమె మొదటి నుంచీ చాలా అసభ్యంగా ప్రవర్తించింది. ఎందుకు ఆలస్యం అయ్యిదంటూ అరిచారు. దానికి బదులుగా ట్రాఫిక్ జామ్, రోడ్ బాగలేదని ఆమె చెప్పా.. తనపై అరుస్తూనే ఆమె ఆర్డర్‌ను అంగీకరించారు. తర్వాత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించచిందని, కానీ, ఆ మహిళ నన్ను బానిస అని పిలవడం.. ఆ తర్వాత ఆర్డర్ రద్దు చేశానని చెప్పిందని.. కానీ, ఆహారాన్ని మాత్రం తిరిగి ఇవ్వడానికి నిరాకరించిందని కామరాజ్ తెలిపారు.

నేను లిఫ్ట్ వైపు వెళ్తుండగా.. ఆమె హిందీలో బూతులు తిట్టారని.. ఆమె అకస్మాత్తుగా నాపై చెప్పులు విసిరి.. కొట్టడం ప్రారంభించారని తెలిపారు. అయితే, భద్రత కోసం, ఆమె నన్ను కొట్టినప్పుడు, నేను నా చేతులు అడ్డుపెట్టాను.. కానీ, ఆమె నా చేతిని దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు.. అదే సమయంలో ఆమె ముక్కు మీద వేలు ఉంగరంతో తనను తాను కొట్టుకుంది.. దీంతో రక్తస్రావం అయ్యిందని.. ఆమె ముఖాన్ని చూసిన ఎవరైనా.. ఇది ఎవరో కొట్టడం వళ్ల జరిగింది కాదని అర్థం చేసుకుంటారని చెప్పాడు.. నేను అసలు ఉంగరాలు కూడా ధరించను అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement