రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడికి అరుదైన గౌరవం దక్కింది. 2022 నోబెల్ శాంతి పురస్కారానికి జెలెన్ స్కీని నామినేట్ చేయాలని మాజీ, ప్రస్తుత యూరోపియన్ యూనియన్ రాజకీయ నేతలు నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఈ కారణంగా నామినేషన్ ప్రక్రియను మార్చి 31 వరకు పొడగించారు. ఈ ఏడాది నోబెల్ బహుమతులను అక్టోబర్ 3 నుంచి 10 వరకు ప్రకటించనున్నారు. 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం 251 మంది వ్యక్తులు, 92 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఆస్పత్రిని సందర్శించిన జెలెన్ స్కీ
రష్యా దాడులను జెలెన్ స్కీ సైన్యం తిప్పికొడుతూనే ఉంది. ప్రజల్లో మరింత ఉత్సాహం నింపేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. రష్యా దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జెలెన్ స్కీ పరామర్శించారు. కీవ్ సమీపంలోని వోర్టెల్ పట్టణంలోని ఓ ఆస్పత్రిని జెలెన్ స్కీ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులను ఆయన కలుసుకున్నారు. కొంత మంది జెలెన్ స్కీతో సెల్ఫీలు దిగారు. ఓ టీనేజర్ జెలెన్ స్కీను టిక్ టాక్ స్టార్‌గా చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు అని తెలియని ఆమె.. మీ గురించే టిక్‌టాక్‌లో మాట్లాడుకుంటున్నారంటూ జెలెన్ స్కీని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. అయితే ఆయన కూడా నవ్వుతూ ముందుకు కదిలారు.
నోబెల్ శాంతి పురస్కారానికి జెలెన్ స్కీ పేరు
Advertisement
తాజా వార్తలు
Advertisement