Friday, November 22, 2024

Zero Power Bill – గృహా జ్యోతి ప‌థకానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం – ఉప ముఖ్యమంత్రి భట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గృహా జ్యోతి స్కీమ్ కు అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ మండలిలో ఆయన మాట్లాడుతూ.. గృహా జ్యోతి స్కీమ్‌కు అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమమని అప్లై చేసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

200 యూనిట్ల లోపు విద్యుత్ ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. గృహా జ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని, గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అలా వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హత కలిగిన వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. .

- Advertisement -

కాగా, గృహజ్యోతి పథకం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 46 లక్షల 19 వేల 236 కుటుంబాల‌ను అర్హులుగా గుర్తించామ‌ని భ‌ట్టి వెల్ల‌డించారు.. గృహహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి జీరో కరెంట్ బిల్లులు ఇవ్వడం జరిగింద‌న్నారు..

▪️ డిస్కమ్ ల ద్వారా ఇప్పటి వరకూ జారీ చేసిన గృహజ్యోతి జీరో బిల్లుల వివరాలు.
● మార్చి 24 నాటికి 33 లక్షల 86 వేల 507.
● ఏప్రిల్ 4 నాటికి 32 లక్షల 52 వేల 794.
● మే 24 నాటికి 31 లక్షల 49 వేల 563.
● జూన్ 24 నాటికి 39 లక్షల 30 వేల 805.
● జులై 24 నాటికి 42 లక్షల 13 వేల 761.
● మొత్తంగా ఈ అయిదు నెల‌ల కాలంలో ఒక కోటీ 79 లక్షల 33 వేల 430కి ఇప్పటికీ జీరో బిల్లులు ఇవ్వడ జరిగింద‌న్నారు డిప్యూటీ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి . 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి అమలుకోసం రూ.2,418 కోట్లను కేటాయించామ‌ని తెలిపారు..

గృహజ్యోతి జీరో బిల్లులకు సంబంధించి డిస్కమ్ నెలనెలా ఆ మొత్తాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రభుత్వం చెల్లిస్తోంద‌ని చెప్పారు.. మార్చి 24కు రూ.98.8 కోట్లు, ఏప్రిల్ 24కు 116.16 కోట్లు, మే 24కు రూ.118.16 కోట్లు., జూన్ 24కు రూ.154.65 కోట్లు. జులై 24కు రూ. 153.17కోట్లు. మొత్తంగా రూ.640.94 కోట్లు డిస్క‌మ్ కు ఇచ్చామ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement