Wednesday, November 20, 2024

మోటార్‌ ఇన్సూరెన్స్‌లో జీరో-డిప్రిసియేషన్‌ కవరేజీ

న్యూఢిల్లి : బీమా అనేది.. వాహనాన్ని రక్షించడానికి ఒక అద్భుతమైన సాధనమని, ఇది థర్డ్‌పార్టీకి కూడా ప్రయోజనాలు చేకూరుస్తుందని, వడగళ్లు, వర్షం, తుఫాను, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా కవర్‌ చేస్తుందని బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ టీఏ రామలింగం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాహన బీమాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. మనుషుల వల్ల వాహనానికి ఎలాంటి డ్యామేజీ జరిగినా.. ఇన్సూరెన్స్‌ కవర్‌ చేస్తుందని తెలిపారు. యాడ్‌ ఆన్‌ అనే కవరేజీ వాహనానికి మరింత భద్రతను కల్పిస్తుందని వివరించారు. కనిపించని ఆర్థిక నష్టాల నుంచి వాహనానికి రక్షణ పొందొచ్చని చెప్పుకొచ్చారు. జీరో డిప్రిసియేషన్‌ కవర్‌ను నిల్‌ డిప్రిసియేషన్‌ లేదా బంపర్‌ టు బంపర్‌ కవర్‌ అని కూడా పిలుస్తారు. స్థిరాస్తి పాతది అయినా కొద్దీ ఎలా అయితే విలువ తగ్గుతూ వస్తుందో.. అలాగే.. వాహన విలువ కూడా పడిపోతుంటుంది. 6 నెలలు కంటే ఎక్కువ కాలం కాని వాహనానికి.. ఎలాంటి ధరలో ఎలాంటి క్షీణత ఉండదు.

రబ్బన్‌, ట్యూబ్‌లకు 50శాతం క్షీణత..

6 నెలల నుంచి 1 ఏడాదికి 5 శాతం, ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు 10 శాతం, 2 ఏళ్ల నుంచి మూడేళ్ల వరకు 15 శాతం, 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు 25 శాతం, 4ఏళ్ల నుంచి 5ఏళ్ల వరకు 35 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 40 శాతం, 10 ఏళ్లుపైబడితే వాహనం విలువ 50 శాతం తగ్గిపోతుంది. క్షీణత రేటు ఒక్కో కేటగిరీలో ఒక్కోలా ఉంటుంది. రబ్బర్‌/నైలాన్‌/ప్లాస్టిక్‌ భాగాలు, ట్యూబ్‌లు, బ్యాటరీలు, పెయింట్‌ వర్క్‌తో పాటు ఎయిర్‌ బ్యాగుల కోసం 50 శాతం, ఫైబర్‌ గ్లాస్‌ భాగాల కోసం 30శాతం, గాజుతో చేసిన అన్ని భాగాలకు ఎలాంటి తరుగుదల ఉండదు. క్లెయిమ్‌ సమయంలో పాలసీ కాపీలో స్పష్టంగా పెర్కొనబడిన తరుగుదల రేటు, క్లెయిమ్‌ను సెటిల్‌ చేయడానికి ముందు పరిగణించబడుతుంది. జీరో క్షీణత కవరేజీ ఉంటే.. పైన తెలిపిన క్షీణత రేటు పరిగణలోకి తీసుకోవడం జరగదు. సంబంధిత క్షీణత రేటును పరిగణలోకి తీసుకోకుండానే.. క్లెయిమ్‌ చెల్లించడంతో నష్ట సమయంలో విస్తృత ఆర్థిక రక్షణను అందిస్తుంది.

కొత్త వాహనాలకు జీరో-క్షీణత..

ఉదాహరణకు వాహనం ప్రమాదానికి గురై.. ఫైబర్‌ గ్లాస్‌ కాంపోనెంట్‌ పాడైంది. ధర రూ.20వేలు అనుకుందాం. సాధారణ మోటార్‌ బీమా పాలసీ మీకు రూ.14వేలు చెల్లిస్తుంది. ఎందుకంటే ఫైబర్‌ గ్లాస్‌ కాంపోనెంట్‌ 30 శాతం కోతను సూచిస్తుంది. జీరో తరుగుదల ద్వారా క్లెయిమ్‌ చేసుకుంటే.. రూ.20,000 నష్టాన్ని కవర్‌ చేస్తుంది. ఎందుకంటే.. కొత్త వాహనాలకు జీరో డిప్రిసియేషన్‌ కవర్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా 5 నుంచి ఏడేళ్ల కంటే పాత కార్లకు అందించబడుతుంది. జీరో డిప్రిసియేషన్‌ కవరేజీ.. ఇంజిన్‌ నష్టాన్ని కవర్‌ చేయదు. ఇంజిన్‌లో నీరు చేరినా.. ఆయిల్‌ లీకేజీ, హైడ్రోస్టాటిక్‌ లాక్‌ వంటి వాటికి నష్టం కట్టివ్వదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement