Sunday, November 3, 2024

ఎన్‌సీసీ క్యాడెట్లకు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు..

ఎన్‌సీసీ క్యాడెట్లకు యూనిఫామ్‌ భత్యాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. సదరు భత్యాన్ని జమ చేసే నిమిత్తం జీరో బ్యాలెన్స్‌ బ్యాంక్‌ ఖాతాలను క్యాడెట్ల పేరిట తెరుస్తారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ఎన్‌సీసీ, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) ఒక పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘పహ్లీ ఉడాన్‌’ పథకం కింద ఎన్‌సీసీ క్యాడెట్లు అందరికీ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను తెరుస్తుంది. క్యాడెట్లకు డెెబిట్‌ కార్డు, చెక్‌ బుక్‌, పాస్‌బుక్‌ అందుతాయి. తాజా పథకం కింద ప్రతి ఏడాది దాదాపు ఐదు లక్షల మంది క్యాడెట్లు లబ్ది పొందుతారు.

క్యాడెట్ల శిక్షణకాలం పూర్తి కావడం లేదా వారికి 18 సంవత్సరాలు పూర్తి కావడంలో ఏది ముందు పూర్తవుతుందో అప్పటివరకు జీరో బ్యాంక్‌ ఖాతాలు పనిచేస్తాయి. తద్వారా క్యాడెట్లకు జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను పరిచయం చేయడంతోనే సరిపుచ్చక, వారి ఖాతాల్లోకి ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా పొందే ప్రయోజనాలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(టీబీడీ) ద్వారా జమ అవుతాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఎన్‌ఐసీ, డీబీటీలను పరిచయం చేయడం ద్వారా ఎన్‌సీసీ డిజిటలైజేషన్‌కు తమ వంతు కృషి చేస్తున్న ఎన్‌సీసీ, బీఐఎస్‌ఏజీ, ఎస్‌బీఐలను అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement