Tuesday, November 26, 2024

ఆయుధాలు వీడి వెళ్లిపోండి.. రష్యన్‌ సైన్యానికి జెలెన్‌ స్కీ వార్నింగ్‌

రష్యా చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో 45 మంది తీవ్రంగా గాయపడినట్టు జెలెన్‌ స్కీ వెల్లడించారు. వారందరినీ ఉక్రెయిన్‌ హీరోలుగా ఆయన అభివర్ణించారు. తమపై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా సైన్యం వెంటనే.. ఆయుధాలు వీడాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సూచించారు. ఆయుధాలు వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మీ కమాండర్లను నమ్మవద్దని, అసత్యాలను చెప్పే మీ నాయకులనూ నమ్మొద్దని సూచించారు. మీ ప్రాణాలు రక్షించుకోవాలంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే 5వేల మందికి పైగా రష్యన్‌ ఆర్మీ ప్రాణాలు కోల్పోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తామేంటో.. ప్రపంచానికి ఉక్రెయినియన్లు చూపించారన్నారు. ఆ తరువాతి పర్యవసానాలు కూడా ఎలా ఉంటాయో.. రష్యాకు తెలిసి వస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలకు తమకు మద్దతు ఇస్తున్నాయని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యే కొద్ది సేపటి ముందు జెలెన్‌ స్కీ ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement