ప్రభన్యస్ : న్యూజిలాండ్ జట్టులో మరో స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇప్పటికే కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ మిచెల్ బ్రాస్‌వెల్ కొవిడ్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా డెవాన్ కాన్వే మహమ్మారి బారిన పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టీమ్… రెండో టెస్ట్ ముగిసిన తర్వాత గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. జూన్ 23న జరుగనున్న మూడో టెస్ట్‌లో డెవాన్ కాన్వే ఆడటం కష్టమే. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు మిచెల్ బ్రాస్‌వెల్ ఐసొలేషన్‌లో ఉన్నారు.
ఓ పక్క వరుస ఓటములు, మరో పక్క కొవిడ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కివీస్ జట్టును గాయాలు బెడద కూడా వేధిస్తోంది. తొలి టెస్టు సందర్భంగా ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్ హోమ్ గాయపడగా, తాజాగా రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జెమీసన్ గాయపడ్డాడు, అతని గాయం చాలా తీవ్రమైందని వైద్యులు ప్రకటించారు. దీంతో జెమీసన్ కూడా మూడో టెస్టు ఆడటం అనుమానమేనని కివీక్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.