టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యువీ తొలిసారి సెంచరీ చేసిన బ్యాట్‌ను ఎన్‌ఎఫ్‌టి మార్కెట్ కలెక్షన్ సంస్థ అంతరిక్షంలోకి పంపింది. ఈ వీడియోను సంస్థ ట్విటర్‌లో షేర్ చేసింది. 2003లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో యువరాజ్‌సింగ్ తన తొలి సెంచరీని నమోదు చేశాడు.
27వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన యువీ 85బంతుల్లో 9ఫోర్లు, 4సిక్స్‌లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గంగూలీ సారథ్యంలోని ఆ మ్యాచ్‌లో భారతజట్టు నిర్ణీత 50ఓవర్లలో 276పరుగులు చేసింది. అనంతరం భారతజట్టు బంగ్లాదేశ్‌ను 76పరుగులుకు ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital