హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండా బీసీల రాజ్యాధికార అజెండాగా మార్చారంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు ముందు, జంతర్‌మంతర్ వద్ద దేశ రాజధాని ఢిల్లీలో బీసీల సమస్యలపై ధర్నాలు చేపట్టిన ఆర్.కృష్ణయ్యను వైసీపీ ఎంపీగా బీసీ గళం పార్లమెంట్లో వినిపించేందుకు రాజ్యసభకు పంపుతున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విద్యానగర్ లో బుధవారం జరిగిన సమావేశంలో కర్రి వేణుమాధవ్ పాల్గొన్నారు.
సీఎం జగన్ దేశంలో బీసీ రాజ్యాధికార సంకల్పానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ద్వారా పార్లమెంటులో బిల్లు పెట్టడమే కాక ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి గురవాచారి, నేషనల్ బీసీ వెల్ఫేర్ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేషనల్ బిసి వెల్ఫేర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిరంజన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మట్ట జయంతి గౌడ్, రమలు శాలువాతో సత్కరించి అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..