హైదరాబాద్ – తెలంగాణలో అన్ని స్థానాలకు పోటీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది..నేడు హైదరాబాద్ లో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.. మొత్తం 119నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్ధులను పోటీకి దింపాలని నిర్ణయించింది.. పాలేరు నుంచి షర్మిల బరిలో నిలువనున్నారు.. అలాగే పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్ధులు తమ దరఖాస్తులు పార్టీ కార్యాలయంలో అందజేయాలని షర్మిల పిలుపు ఇచ్చారు.. ఈ ఎన్నికలలో తమ పార్టీ అధికార పార్టీతో సహా అన్ని పార్టీలకు గట్టి పోటి ఇవ్వనుందని పేర్కొన్నారు. – బ్రదర్ అనిల్,విజయమ్మ గారిని కూడా పోటీ పెట్టాలని డిమాండ్ ఉందని, దీనిని పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరం అయితే అనిల్ ,.విజయమ్మ సైతం పోటీ చేస్తారన్నారు..
కాగా, కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నామని, అందుకే ఆ పార్టీతో చర్చలు జరిపామన్నారు..విడిగా పోటీ చేసినట్లయితే ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుందనే భావనతో కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలని అనుకున్నామన్నారు.. దీనికోసం నాలుగు నెలలు ఎదురు చూశామని, అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు.. అందుకే ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని, తెలంగాణలో వైఎస్ ఆర్ పాలన తీసుకువస్తామని షర్మిల అన్నారు.