వైఎస్ఆర్‌సీపీకి ఉన్న గుర్తింపు ఇకపై కూడా కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెలువరించింది. వైఎస్ఆర్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. వైఎస్ఆర్ అనే పదం తమకే చెందుతుందంటూ ‘అన్న వైఎస్ఆర్ పార్టీ’ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని, పిటిషన్‌కు ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ, ‘అన్న వైఎస్ఆర్ పార్టీ’ వేసిన పిటిషన్‌ను ఈ సందర్భంగా కోర్టు కొట్టి వేసింది. వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ప్రతీక్ జైన్ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును వెలువరించింది. వైఎస్ఆర్‌సీపీ అనేది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని ఆ పార్టీ తన పిటిషన్‌లో పేర్కొంది. తమ పార్టీ పేరు వైసీపీ వాడుకుంటోందని వాదించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ… ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తాము తీసుకున్నామని పిటిషనర్ వాదనలో మెరిట్ లేదని వెల్లడించింది.