Friday, November 22, 2024

వాళ్లిద్దరి వల్ల వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం

అమరావతి: జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చింతమనేని ప్రభాకర్, వనజాక్షి వ్యవహారం వల్ల టీడీపీ ప్రభుత్వం పతనమైందని.. అదే తరహాలో ఓ ఇద్దరి వల్ల ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పతనమవుతోందని పోతిన మహేష్ ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు అవినీతి వల్ల వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. అన్యాయానికి అండగా వైసీపీ ప్రభుత్వం నిలబడితే… చరిత్ర పునరావృతం అవుతుందని విమర్శలు చేశారు. అమ్మవారి డబ్బులు, ఆలయాల భూములను వెల్లంపల్లి అడ్డంగా దోచుకున్నారని చెప్పారు. వెల్లంపల్లితో తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేయిస్తే వైసీపీ ఓడిపోతుందని… అందుకే ప్రచారం చేసే వారి జాబితాలో ఆయన పేరును చేర్చలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement