కోరుకొండ : మండలం పశ్చిమగోనగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేడిశెట్టి మణి వెంకట శివరామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన సరోజిని మృతి చెందడంతో గ్రామంలో ఎన్నిక నిలిచిపోయింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఒక్కరికే అవకాశం రావడంతో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బికే మల్లికార్జునరావు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నరేష్ కుమార్ లకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ జడ్పిటిసి సభ్యులు కర్రి నాగేశ్వరరావు, మండల వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వుల్లి బుజ్జిబాబు, తిరుమలశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేడిశెట్టి మంగ రామచంద్రరావు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో కోరుకొండ ఎస్ ఐ కట్టా శారదా సతీష్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement