ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు దొరికాయని సీబీఐ తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన గజ్జల ఉమాశంకర్ రెడ్డి సహా ఇతర నిధితులు ఇటీవల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేయొద్దని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగానే అతడికి సంబంధించిన ఆధారాల గురించి కోర్టుకు వివరించారు. ఇక ఈ కేసులో గజ్జల ఉమాశంకర్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. హత్య జరిగిన రోజు తెల్లవారు జామున రోడ్డుపై అతడు పరుగులు తీస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. దీనికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement