Monday, November 18, 2024

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో.. సీబీఐ కొత్త ఎస్పీ బాధ్యతలు

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఇటీవల వేగం పెంచింది. అనుమానితులను వరుసగా విచారిస్తూ కీలక విషయాలు  రాబడుతోంది. ఇటీవల వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్నను కూడా విచారించారు.

ఇక విచారణలో రంగన్న పలు కీలక విషయాలు వెల్లడించినట్టు వార్తలు బయటకొచ్చాయి. ఇప్పటి వరకు ఈ దర్యాప్తు మొత్తం ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లిపోగా తాజాగా ఆమె స్థానంలో ఎస్పీ స్థాయి అధికారి ఒకరు నిన్న ఢిల్లీ నుంచి కడప చేరుకుని బాధ్యతలు చేపట్టారు. రెండు రోజులుగా అనుమానితులను ఎవరినీ సీబీఐ విచారణకు పిలవలేదు.

కేసును విచారించేందుకు కొత్తగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రామ్ కుమార్ ఇవాళ కడపకు చేరుకున్నారు. ఇక సీబీఐ డీఐజీ సుధాసింగ్​ను తిరిగి విజయవాడకు పంపించారు. మొన్నటి వరకు డీఐజీ సుధాసింగ్ 49 రోజులపాటుగా కేసులోని అనుమానితులను విచారించారు. రంగన్న వాంగ్మూలాన్ని కీలక పరిణామంగా భావిస్తున్న సమయంలో.. కొత్త అధికారి రావటం ఆసక్తిని రేపుతోంది. కొద్దిరోజుల కిందట మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షణ అధికారిని ఉన్నతాధికారులు మార్చారు. మరోవైపు రేపట్నుంచే కేసులోని కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : స్థిరంగా బంగారం ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement