మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. కేసు విచారణ 73వ రోజు కొనసాగుతోంది. కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులు.. సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్‌ను ప్రశ్నిస్తున్నారు. కేసులో అనుమానితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డితోపాటు మహబూబ్ బాషా, నాగేంద్ర సైతం సీబీఐ విచారణకు హాజరయ్యారు.
మరోవైపు వైఎస్ వివేకా కుమార్తె సునీత కడపలో సీబీఐ అధికారులను కలిశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు పురోగతి పై ఆరా తీశారు. కేసు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సైతం దర్యాప్తు తీరును సునీతకు వివరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. వివేక హత్య కేసులో మంగళవారం వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. కడప జైలులో విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.