వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ నల్గొండలో నిరుద్యోగ దీక్షలో పాల్గొంటారు… పార్టీ పెడతున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై గళమెత్తున్నారు వైఎస్ షర్మిళ అందులో భాగంగానే ప్రతి మంగళవారం రాష్ట్రంలోని ఏదో ఒక ప్లేసులో నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు.. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కాగా.. శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ షర్మిల.. ఆ తర్వాత దీక్ష చేపట్టనున్నారు.. ఆమె దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ కార్యదర్శులతో కేటీఆర్ భేటీ