హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులతో వందలాది నామినేషన్లు వేయిస్తామన్నారు వైఎస్సార్‌టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల. ‘కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇక నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుంది’ అని షర్మిల తెలిపారు. ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది విద్యార్థులు. 7 ఏండ్ల తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది వైఎస్సార్‌టీపీ. 7 వారాలుగా నిరుద్యోగ నిరాహార దీక్షలతో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం’ అని షర్మిల చెప్పారు.
ఇది కూడా చదవండి: మెగాస్టార్ బర్త్ డేః చిరంజీవికి అభిమానులు ఇచ్చే కానుక ఎంటంటే..