Friday, November 22, 2024

రాజు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తుచేశాడు: షర్మిల

హైదరాబాద్‌‌లోని సైదాబాద్‌లో చిన్నారి చైత్రను అత్యాచారం చేసిన నిందితుడు రాజు రైల్వేట్రాక్ వద్ద ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల స్పందించారు. తాము బుధవారం చేసిన దీక్ష వల్లే మంత్రులు బాధిత‌ కుటుంబాన్ని పరామర్శించారని ఆమె చెప్పుకొచ్చారు.

‘సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే 6 రోజులైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖం చెల్లని ఈ ప్రభుత్వ పెద్ద‌లు.. మేము నిన్న చేసిన దీక్ష వల్ల దిగొచ్చి ఈ రోజు మంత్రులు బాధిత‌ కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న, మొన్న ఆ కుటుంబాన్ని కలవడానికి రాని మంత్రులు ఈరోజు నిందితుడు చనిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని కలవడానికి పోటీ పడటానికి సిగ్గుండాలె. నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యానికి ఒక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రేపిస్ట్ ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు’ అంటూ ష‌ర్మిల ట్వీట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement