కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని సీఎం కేసీఆర్ చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె.. ఒకపక్క కరోనా వల్ల పేదల ప్రాణాలు పోతుంటే ఇంకెప్పుడు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తారని కేసీఆర్‌ను నిలదీశారు. చచ్చేవారు పేదలు కాదా? పేదలు చచ్చినా ఎవరూ అడగరనే ధైర్యమా అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం లెక్కకు సరిపడా మరణాలు ఇంకా నమోదు కాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరగబడకముందే ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. లేకపోతే కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయమంటూ షర్మిల ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement