తెలంగాణలో వైఎస్ ఆర్ టీపీ పేరుతలో వైఎస్ షర్మిల పార్టీని స్థాపించి తనదైనశైలిలో దూసుకుపోతున్నారు. పాదయాత్రని చేశారు..ప్రతి మంగళవారం నిరుద్యోగుల సమస్యపై దీక్షని చేపట్టారు. కాగా ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు షర్మిల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్ష చేయనున్నారు. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 72 గంటల పాటు ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహారదీక్షకు చేయనున్నారు. మిగతా 48 గంటలు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగనుంది. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలుపై ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీలు ధర్నా చేస్తున్నాయి. మరి షర్మిల చేస్తోన్న ఈ ధర్నాకి ఎవరు మద్దతు ఇస్తారో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement