తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య అభిప్రాయబేధాలు మరోసారి మీడియా సాక్షిగా బయటపడ్డాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష జగన్-షర్మిల మధ్య ఉన్న గ్యాప్‌ను బయటపెట్టింది.
దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడుతున్న సమయంలో సాక్షి టీవీ కెమెరామెన్ కనపడ్డారు. దీంతో షర్మిల స్పందిస్తూ ‘ మీరు ఇక్కడికెందుకు వచ్చారు.. ఎలాగు కవరేజ్ ఇవ్వరు…. వెళ్లిపోండి’ అంటూ సూటిగా చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. పక్కనే ఉన్న విజయమ్మ షర్మిలను సముదాయించగా షర్మిల కాస్త సైలెంట్ అయ్యారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.92లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల దీక్షకు దిగారు. స్వరాష్ట్ర పోరాటంలో రబ్బరు బుల్లెట్లకు, టియర్ గ్యాస్ షెల్స్‌కు బయపడని యువత… కేసీఆర్ కారణంగా ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు.