తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ”దొరగారి పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ చూసి ”అర్ధరాత్రి ఆడవాల్లు ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రం” అన్న గాంధి గారి ఆత్మ క్షోబిస్తుంది. పట్టపగలు కూడా మహిళలకు ఇంకా స్వాతంత్రం రాలేదు. మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
‘’పట్టపగలే మహిళల ప్రాణాలను జైలు గోడల మధ్య గాల్లో కలిపేస్తున్నారు, చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టిస్తున్నారు, ఇది 75 ఏండ్ల స్వతంత్ర దేశములో 7 ఏండ్ల స్వరాష్ట్ర తెలంగాణలో మహిళల దుస్థితి స్వతంత్ర పోరాట స్పూర్తితో మహిళల రక్షణ కోసం, మహిళల హక్కులకోసం మరో పోరాటాన్ని నిర్మిద్దాం’’ అంటూ షర్మిల పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: హుజురాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫ్లెక్సీ.. ఆ ఫ్లెక్సీలో ఏముంది?