తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ‘’తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలి. అవమానంతో సీఎం కేసీఆర్ తలదించుకోవాలని…చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’’ అని షర్మిల పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement