Tuesday, November 26, 2024

మతకల్లోలాలు సృష్టించటంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా…ధర్మపురి పై షర్మిల ఫైర్

తెలంగాణలో రాజకీయకీయంగా నెలదొక్కుకునేందుకు షర్మిల అన్ని రకాలుగా దూకుడు పెంచారు. ఇప్పటికే ఏప్రిల్ 9న ఖమ్మం లో జరిగే సభలో పార్టీ పేరును విధి విధానాలను కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనం పేరుతోసమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నిజామాబాద్ ,ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ జిల్లా కు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపర్ రాసిచ్చారట… అంటూ ధర్మపురి అరవింద్ పై షర్మిల సెటైర్లు వేశారు. ఆ బాండ్ పేపర్ రైతులకు ఇచ్చి మోసం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా అంటూ విమర్శించారు. తెలంగాణలో పసుపు రైతులు ఎంతో కష్టపడుతున్నారని… ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాల్లో ఉంటే కనిపించడం లేదా అంటూ విమర్శించారు. భైంసాలో మతకల్లోలాలు సృష్టించడం పై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఎందుకు లేదని ధర్మపురి అరవింద్ ను ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement