తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శల బాణం ఎక్కుపెడుతూనే ఉన్నారు. కరోనా చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ప్రచారం కోసం మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. మహిళలతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన షర్మిల.. కరోనా చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం రాష్ట్రంలోని మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని షర్మిల అన్నారు. గతేాడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికమన్నారు. ప్రభుత్వం స్పందించి గత మూడేళ్ల వడ్డీలతోపాటు రుణాలను కూడా మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
చికిత్స కోసం యశోదకు.. ప్రచారం కోసం గాంధీకి: కేసీఆర్‌పై షర్మిల విమర్శలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement