తెలంగాణలో నిరుద్యోగులకు అండగా ఉండేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అనంతరం ఆమె ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’లో పలువురు విద్యార్థులు, స్థానిక నేతలు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో లక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వరకు తాను పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు.
ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లాలో 16 పురాతన నాణేలు లభ్యం