ఇండోనేషియాలో తూర్పు జావాలోని గ్రెసిక్‌కు చెందిన సైఫుల్ ఆరిఫ్ (44) యూట్యూబర్ గా పనిచేస్తున్నాడు. అయితే తను అందరి దృష్టిలో పడాలని ఓ వింత పని చేశాడు. దీంతో ఇప్పుడు తను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. యూజర్స్‌ని ఆకట్టుకోవడానికి ఈ పనిచేసి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు ఆరిఫ్. ఇంతకీ తను ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా అశ్చర్యపోతారు..
ఆరీఫ్ పెళ్లి చేసుకున్న వీడియోని అప్ లోడ్ చేస్తే వైరల్ ఎందుకు అయ్యాడు అనుకునేరు. అతను పెళ్లి చేసుకుంది మనిషిని కాదు ఓ ఆడ మేకని. జూన్ 5న గ్రేసిక్‌లోని బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో రహయు బిన్ బెజో అనే పేరుగల ఆడ మేకను వివాహం చేసుకున్నాడు సైఫుల్ ఆరిఫ్. ఈ వేడుకను వీడియో కూడా తీయించుకున్నాడు.. ఈ వీడియోలో ఆరిఫ్ జావానీస్ దుస్తులు ధరించి కనిపించగా, మేకను శాలువాతో అలంకరించారు. అక్కడి స్థానికులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు హాజరయ్యారు. అంతేకాదు అతడు ఆ మేకకు రూ.22,000 కట్నం కూడా ఇచ్చాడు. అయితే.. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొందరు మండిపడ్డారు. దీంతో సైఫుల్ అందరికీ క్షమాపణ చెప్పాడు. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమేనని, ఎవరినీ ఇబ్బందిపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.