Friday, November 22, 2024

YouTube | త‌ప్పుడు వైద్య స‌లహాల వీడియోల‌కు యూట్యూబ్ క‌త్తెర..

యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్‌లో వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కొత్త విధానాన్ని అమ‌లులోకి తెచ్చింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు యూట్యూబ్ అప్‌డేటెడ్‌ అప్రోచ్‌ను ప్రకటించింది. అంద‌రూ యూజ్ చేసే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లో ఏ సమాచారమైనా క్షణాల్లో వ్యాపిస్తోంది. దీంతో తప్పుడు సమాచారం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఈ కఠిన చర్యలు తీసుకుంటోంది.

వైద్య సలహా సహా వివిధ రకాల సమాచారంపై తప్పుదారి పట్టించే కంటెంట్‌కు యూట్యూబ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వీడియోలను తీసివేయడానికి యూట్యూబ్‌ కొత్త చర్యలను ప్రకటించింది.

యూట్యూబ్ ప్ర‌క‌టించిన అప్రోచ్‌ అప్‌డేటెడ్ లో ప్రివెన్షన్‌, ట్రీట్‌మెంట్‌, డినైల్‌ అనే మూడు కొత్త నియమాలను పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలకు విరుద్ధంగా కంటెంట్ ఉన్న ఆరోగ్య విషయాలను ఈ కేటగిరీలు కవర్ చేస్తాయి. హానికరమైన కంటెంట్‌ను గుర్తించడం, తీసివేయడం సులువుగా మార్చేందుకు ఈ అప్రోచ్‌ను కంపెనీ అమలు చేయనుంది.

- Advertisement -

అన్‌ ప్రూవెన్‌ హెల్త్‌ మెథడ్స్ వీడియోలకు చెక్..

క్యాన్సర్ చికిత్సలు, సలహాలను సూచించే వీడియోలను యూట్యూబ్ త‌న ప్లాట్‌ఫారమ్ నుండి తొల‌గిస్తోంది. వీటితో పాటు కోవిడ్-19, వ్యాక్సిన్‌లు, రీప్రొడక్టివ్‌ హెల్త్‌ వంటి అంశాల్లో అన్‌ ప్రూవెన్‌ హెల్త్‌ మెథడ్స్‌ ప్రోత్సహించే వీడియోల‌ను కూడా తీసివేస్తోంది. ప్రొఫెషనల్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ను నిరుత్సాహపరిచే వీడియోలను కూడా తొలగిస్తూ ఈ చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement