Friday, November 22, 2024

వ్యవసాయం వైపు యువత దృష్టి సారించాలి : రఘునందన్‌ రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యువత వ్యవసాయం వైపు దృష్టి సారించేలా వారిని ఆకర్షితుల్ని చేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి, అగ్రికల్చర్‌ ప్రొడక్షన్‌ కమిషనర్‌ రఘునందన్‌ రావు పేర్కొన్నారు. డేటా టెక్నాలజీలతో కూడిన వ్యసాయ పద్ధతుల్ని ప్రోత్సహించాలన్నారు. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ సంయుక్తంగా రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన జేఫార్మ్‌ అండ్‌ ప్రొడక్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.

24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకునేలా చేస్తోందన్నారు. వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ కాలానుగుణంగా వ్యవసాయ విధానాలు, యాజమాన్య పద్ధతులు మారాలని తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించాలన్నారు. రిస్క్‌, ఖర్చులు తగ్గించేలా సాగు విధానాలు ఉండాలన్నారు. యాంత్రీకరణ, సమర్థ యాజమాన్య విధానాలు, పంటల మార్పిడిలను ప్రోత్సహించాలని వెల్లడించారు. ఈకార్యక్రమంలో టఫే ఛైర్మన్‌, ఎండీ మళ్లికా శ్రీనివాసన్‌, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement