యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన కరపత్రాలను రాహుల్ హెగ్డే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దని సంతోషం తో మొదలై జీవితాలు విషాదంతో అంతమవుతాయి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల అనునిత్యం దృష్టి పెట్టాలని ప్రవర్తనలో మార్పులను గమనించాలని సూచించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ పట్ల కలిగే దుష్పరిణామాల పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ యువతలో అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ పుణ్యం చందర్. హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్. న్యాయవాది కనుకుంట్ల తిరుమల పట్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.