నిజామాబాద్ : బీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ కాలేదు.. ఆ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయ్యింది అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏదో ఒక విమర్శ చేయాలని అనడం తప్పా ఆయన మాటల్లో ఏం లేదని, కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇరుకు గల్లీలో పెట్టుకునే నీ ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రజల కోసం నీ కేంద్రం నుంచి ఏం తెచ్చావు.. మోడీ 8 ఏళ్లలో దేశానికి ఏం చేశాడు.. ఏం చేయబోతున్నాడు ఇవి చెప్పుకో అని కేంద్రంపై మండిపడ్డారు. మతి భ్రమించి అర్దం పర్డం లేని మాటలు మాట్లాడకు బండి సంజయ్ అన్నారు. ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేను ఇప్పటివరకు ఇంత పెద్ద సభ చూడలేదు అన్నారు. నా కంటికి ఎంత దూరం కనిపిస్తుందో అంతదూరం కంటే ఎక్కువే జనాలు ఉన్నారని చెప్పారు. బండి సంజయ్ కు అది కనిపించక పోవడం దురదృష్టకరం అన్నారు. భవిష్యత్ లో దేశంలో ఎక్కడ ఏ సభ జరిగినా ఇట్లాగే ఉంటది. రైతులకు ఉచిత కరెంట్ గురించి బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. కంటి వెలుగు “వరల్డ్ లార్జెస్ట్ ఐ స్క్రీన్ టెస్ట్” ప్రోగ్రాం అని, గిన్నీస్ బుక్ రికార్డ్ కానుందన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్ని మానవీయ కోణంలోనే ఉంటాయన్నారు. ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదు. పార్టీలకు, రాజకీయాలకు, వ్యక్తులకు అతీతంగా కేసిఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement