Thursday, November 21, 2024

ఇదేం ఘోరం? యువతి కోసం తమ్ముడిని చంపిన అన్న

విశాఖ జిల్లా పూడిమడకలో దారుణం చోటు చేసుకుంది. ఒకే యువతితో వివాహం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. అయితే సదరు యువతి అన్నకు బదులు తమ్ముడిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపింది. దీంతో యువతి నాదంటే నాదంటూ గత కొంతకాలంగా అన్నదమ్ములు తరచూ గొడవ పడుతూ ఉండేవారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అన్న రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. పట్టరాని కోపంతో తమ్ముడు ఎర్రయ్యను కత్తితో పొడిచాడు. తీవ్రగాయాల పాలైన ఎర్రయ్యను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా తమ్ముడిని హత్య చేసిన అన్న రాజుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement