ఐపీఎల్ 2024లో భాగంగా ముల్లన్పూర్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ విధ్వంసక బ్యాట్స్మెన్లను పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. అయితే, తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులకే చేయగలిగింది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16) పరుగులతో వెనుదిరిగారు. ఆ తరువాత రాహుల్ త్రిపాఠి(11), క్లాసెన్(9) వెంటవెంటనే అవుట్ అయ్యారు. అయితే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆదుకున్నాడు… (63) పరుగులతో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 64 పరుగులకే 4 వికెట్లు పడగొట్టుకున్న జట్టుకు భారీ స్కోరు అందించే బాధ్యత తీసుకున్నాడు. ఇక నితీశ్ ఔటైన తర్వాత అబ్దుల్ సమద్ (25), షాబాజ్ అహ్మద్ (14 ) లు బౌండరీలతో చెలరేగారు. ఫలితంగా సన్రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఇక, పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. శామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా, కగిసో రబడా ఒక వికెట్ తీశాడు. కాగా, 183 పరుగుల లక్ష్యంతో పంజాబ్ జట్టు ఛేజింగ్ ప్రారంభించనుంది.