Friday, November 22, 2024

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. పురుషాంగం కోసుకున్న యువకుడు

ఇటీవల కాలంలో యువతి, యువకులు పెళ్లి విషయంలో ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు అయితే ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.. లేదా ఎదుటి వారి ప్రాణాలు తీసేస్తున్నారు. తమ మనసులోని వేదనను తల్లి దండ్రులతో చెప్పుకోలేక క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా పెళ్లి ఇష్టం లేనప్పుడు తల్లిదండ్రులను ఒప్పించగలగాలి. తాజాగా చెన్నైలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువకుడు ఎవ్వరూ ఊహించని పనికి పాల్పడ్డాడు.

చెన్నై గాంధీ నగర్‌కు చెందిన మురుగన్ కుమారుడు 23 ఏళ్ల విజయరాఘవన్‌కు పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే తనకు రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. అయినా అయినా వినకుండా కుటుంబీకులు అతనికి ఓ యువతితో వచ్చేవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. పెళ్లి వద్దు అన్నా వినని తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఉలి సహాయతో పురుషాంగాన్ని కోసుకున్నాడు. తను ఇక పెళ్లికి పనికిరానంటూ కేకలేశాడు. తల్లిదండ్రులు అతనిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హడావుడిలో చేతిలో ఉన్న ఉలి గొంతుకు తగలడంతో అక్కడా తీవ్రంగా గాయమైంది. కుటుంబీకులు బాధితుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళ్తే.. రాబిస్ టీకా వేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement