దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ మరోసారి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సూపర్ సిక్స్‌లో దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో అదరకొట్టింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఇవ్వాల (మంగళవారం) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల తేడాతో గెలుపొందింది యువ భారత్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.
ఇక చేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టును 81 పరుగులకే ఆలౌట్ చేసింది యంగ్ ఇండియా. భారత బౌలర్లలో అత్యధికంగా సౌమీ పాండే 4 వికెట్లు తీయగా.. రాజ్ లింబాని, ముషీర్ ఖాన్, 2 వికెట్లు తీశారు. ఇక నమన్ తివారీ, అర్షిన్ కులకర్ణి చరో వికెట్ దక్కించుకున్నారు.
అంతక ముందు బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లలో ముషీర్ ఖాన్.. (131) మరోసారి శతకం బాదాడు. ముషీర్‌కు తోడుగా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (58), కెప్టెన్ ఉదయ్ సహరన్ (34) లు రాణించడంతో కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.