Friday, November 22, 2024

HYD: మియాపూర్ ఘటనలో యువతి తల్లి మృతి

ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని కోపం పెంచుకున్న యువకుడు.. ఆ యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో నిన్న జరిగింది. ఈ ఘటనలో యువతి తల్లి మృతిచెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి తల్లి మృతిచెందగా.. యువతి చికిత్స పొందుతోంది. నిన్న ప్రేమోన్మాది దాడి చేయడంతో యువతి, ఆమె తల్లికి తీవ్రగాయాలైన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో యువతి తల్లి చనిపోయింది. తల్లీ కూతుళ్లపై దాడిచేసిన తర్వాత యువకుడు సందీప్ తాను గొంతు కోసుకున్నాడు. కోఠి ఆస్పత్రిలో సందీప్ కు సర్జరీ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement