Friday, November 22, 2024

ఉద్యోగం లేక ప్రేమించాన‌ని చెప్ప‌లేక‌పోతున్నా… బిహార్ డిప్యూటీ సిఎంకు యువ‌తి లేఖ‌..

ప‌ట్నా – బిహార్ః బిహార్ లో ఎప్పుడో ఒక‌సారి ఉద్యోగ నోటిఫికేషన్ వ‌స్తుంది.. ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.. ఆ త‌ర్వాత పేప‌ర్ లీక్ అంటూ ఆ ప‌రీక్ష ర‌ద్దు చేస్తారు..అక్క‌డ జ‌రుగుతున్న‌ర‌ద్దు గోల‌తో త‌న ప్రేమ స‌ఫ‌లం కావ‌డం లేదంటూ ఓ నిరుద్యోగి య‌వ‌తి అస‌హ‌నం వ‌క్తం చేసింది.. దీంతో ఏకంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం కు లేఖ రాసింది. ఎఫైర్​ పెట్టుకోవాల్సిన వయసులో కరెంట్​ ఎఫైర్స్​ చదువుతున్నాను. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి నా మనసులోని మాటను చెప్పలేకపోతున్నాను.’ అంటూ ఓ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​కు వివ‌రించింది.

“మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంకిగా మారింది” అంటూ ఆ లేఖలో తన గోడు వెల్లబోసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పింకీ అనే యువతి పేరిట ఈ లేఖ వచ్చింది. నాలుగు సంవత్సరాలుగా తాను ప్రభాత్​ అనే రచయితను ప్రేమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. అతడిని వన్​సైడ్​ లవ్​ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలకున్నట్లు ఆ యువతి తెలిపింది. అయితే ఉద్యోగం రానందువల్ల తన ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతున్నానంటూ వాపోయింది. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్​ వెలువడలేదని ఒకవేళ ​వచ్చినా పేపర్ లీక్​ అవుతోందని అసహనం వ్యక్తం చేసింది. లీకుల గోల పోయి నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుందంటూ ఏకంగా తేజ‌స్వీని ప్ర‌శ్నించింది.. త‌న‌కు ఉద్యోగం రాక‌పోతే త‌న ప్రేమ క‌ల‌గానే మిగిలిపోతుందంటూ ఆ యువ‌తి నిట్టూర్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement