స్మార్ట్ ఫోన్ కోసం ఎగబడింది ఓ కోతి పిల్ల. ఓ వ్యక్తి ఫోన్ తో కోతులను ఫొటోతీయడానికి ప్రయత్నించాడు.తల్లి కోతి వారిస్తున్నఆ కోతి పిల్ల మాత్రం అతని దగ్గర్నుంచి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ కోతిపిల్ల తల్లి… అచ్చం మన అమ్మల్లాగే.. కోతిని వెనక్కి లాగుతోంది.. దీన్నంతా ఫొటోతీయాలని ట్రై చేసిన వ్యక్తి వీడియో తీయగా.. ఆ తరువాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిట్టి కోతిపిల్ల కాస్తా వైరల్ అయి, సెలబ్రెటీగా మారిపోయింది. దాని పిల్ల చేష్టలు.. తల్లికోతి పెద్దరికం.. ఇప్పుడు నెటిజన్ల హృదయాల్ని గెలుచుకుంటున్నాయి. ఈ వీడియో మీద కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షలకు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు సుశాంత్ నందా పెట్టిన క్యాప్షన్ కూడా అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అతను ఈ వీడియోకు ‘యువతరం స్మార్ట్ ఫోన్లంటే పడి చచ్చిపోతున్నారు’… అంటూ క్యాప్షన్ పెట్టాడు.
స్మార్ట్ ఫోన్ కోసం ఎగబడిన పిల్ల కోతి- వద్దంటోన్న తల్లి కోతి- వైరల్ గా వీడియో
Advertisement
తాజా వార్తలు
Advertisement