Saturday, November 23, 2024

యువతుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

సాధారణంగా యువకుడి వేధింపులు తాళలేక అమ్మాయిలు పలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. కానీ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో విచిత్రం చోటుచేసుకుంది. మండలంలోని మొరిపిరాలకు చెందిన సందీప్ మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం అయింది. అందులో ఒకరిపై సందీప్ ప్రేమలో పడ్డాడు.

ఇటీవల మిగతా ఇద్దరు యువతులు సందీప్‌కు ఫోన్ చేసి ప్రియురాలు చనిపోయిందని, అందుకు కారణం నువ్వేనంటూ బెదిరించారు. ఈ నెల 12న మరోమారు ఫోన్ చేసిన యువతులు సందీప్‌ను బెదిరించారు. దీంతో భయపడిపోయిన యువకుడు స్వగ్రామానికి చేరుకుని పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: 86 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన మాజీ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement