భారతీయులకు తీపి పదార్థాలంటే మహా మక్కువ. ఇందులో స్వీట్లు ప్రత్యేకమైనవి. కొంత మంది తమకిష్టమైన స్వీట్లకోసం దుకాణాల ముందు బారులుతీరి మరీ కొంటారు. ఇం కొందరు ఎంతో ఓపిగ్గా ఇంట్లోనే నచ్చిన స్వీట్లు తయారు చేసుకుంటారు. వీటిలో ఉపయోగించే పదార్థాలను బట్టి మిఠాయిల ధరలుంటాయి. ఇండియాలో స్వీట్లకు కొరత లేనప్పటికీ, కొన్ని సార్లు వాటికోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుం టుంది. ఢిల్లిలో ఓ దుకాణంలో కిలో స్వీటు రూ.16,000 వేలకు విక్రయిస్తున్నారు. దీనికి గోల్డెన్ స్వీట్ అని పేరు పెట్టారు. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని షాగున్ స్వీట్స్‌లో ఈ స్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
మొదట స్వీట్‌ను సిద్ధంచేసి, ఆపై దానిమీద బంగారు పూత కలిగిన పేపర్‌ను ఉంచుతారు. కేకులాంటి పెద్దస్వీటును చిన్న చిన్న ముక్కలుగా చేసి అందంగా ముస్తాబు చేస్తాసి గోల్డ్ స్వీట్ పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే కోటి మంది వీక్షించారు. 5.77 లక్షల లైక్‌లు, వేలాది కామెంట్లు వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital