భారత జట్టులో మార్పుల కారణంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్రేక్ తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ కోసం ప్రస్తుం జరుగుతున్న టీ20 మ్యాచ్‌ల నుంచి విరామం తీసుకున్నాడు కోహ్లి. అయినా.. అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయుడిగా పేరుగాంచాడు. ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Instagramలో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తులలో విరాట్ ఉన్నాడు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రస్తుతం 256 మిలియన్ల మంది ఫాలోవర్లతో భారత్ లోనే టాప్ లో ఉన్నాడు కోహ్లీ.
కాగా, ఒక నివేదిక ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పెట్టిన ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కు 11.45 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పోస్టుకు అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తుల జాబితాలో టాప్ 20లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా కేవలం విరాట్ కోహ్లీ స్థానం సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా, అతని ప్రధాన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రొనాల్డో విషయానికొస్తే, అతను ఒక ఇన్స్టా పోస్ట్ కు USD 3.23 (26.75 కొట్లు) మిలియన్ల భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాడు. మరోవైపు, మెస్సీ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు USD 2.56 (21.49 కోట్లు) మిలియన్లు వసూలు చేస్తున్నాడు.