మీ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాపై విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ఈ యుద్ధంలో మీకు సాయంగా, మా దేశం తరపున మద్దతుగా గ్రెనేడ్ల షిప్‌మెంట్ బహుమతిగా ప్రేమతో పంపిస్తున్నా స్వీకరించండి… అంటూ ఉక్రెయిన్‌కు స్పెయిన్ రాణి లెటిసియా ఓ సందేశాన్ని పంపారు. పెద్దఎత్తున సంప్రదాయ ఆహార పదార్థాలు, గ్రెనేడ్లుకూడిన పెట్టెల్లో విజయాన్ని కాంక్షిస్తూ సందేశాలున్న పోస్టుకార్డులు, ఆయుధాలతో కూడిన షిప్‌మెంట్‌ను యుద్ధపీడిత ఉక్రెయిన్‌కు ఆమె బహుమతిగా పంపారు. తనకన్నా ఎన్నోరెట్ల బలమైన రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలనుంచి పెద్దఎత్తున ఆయుధ సహాయం అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి స్పెయిన్ చేరింది. పైగా ఉక్రెయిన్ పౌరులకు ప్రేమతో ఇవి పంపిస్తున్నానంటూ స్పెయిన్ రాణి స్వదస్తూరీతో సందేశం రాయడం విశేషం. ఆమె కానుక విషయం, పోస్టు కార్డు సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆ షిప్‌మెంట్ ఇప్పటికే ఉక్రెయిన్‌కు చేరుకుంది.
కొనసాగుతున్న రష్యా దాడులు..
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత ముమ్మరమైనాయి. ఆ దేశంలోని ఆరు స్థావరాలపై క్షిపణులతో దాడులు చేశామని, విదేశాలనుంచి ఉక్రెయిన్ డాన్‌బాస్క్‌కు చేరిన ఆయుధాలను ధంసం చేశామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. అలాగే, వివిధ దేశాలనుంచి ఆయుధాలను చేరవేస్తున్న రైలే వ్యవస్థలనూ ధ్వంసం చేశామని పేర్కొంది. డోనెట్స్, స్లవ్యాన్స్క్ ప్రాంతాల్లో ఆయుధ గొడౌన్లను పేల్చేశామని ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..