Tuesday, November 26, 2024

కరోనా వ్యాక్సినేషన్‌పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా వ్యాక్సినేషన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన వారు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి.. వ్యాక్సిన్ వేయించుకోవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 45-59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికెట్ సమర్పించాలని, లేదా బ్లడ్ రిపోర్టు, మందుల చీటీ చూపించి వ్యాక్సిన్ వేయించుకోవాలంది. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తారని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement