మొబైల్ ఫోన్ల ద్వారా జాతీయ పింఛన్ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇందుకు వీలుకల్పించే డిజిటల్ ప్లాట్‌ఫాం ను పింఛన్ నిధి నియంత్రణ సంస్థ పీఎఫ్‌ర్‌డీఏతో కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించింది. ఇందుకు కె-ఫిన్‌టెక్ సహాయాన్ని తీసుకుంది. వినియోగదారులు ఎన్‌పీఎస్ ఖాతాను ఒక క్యూఆర్ కో డ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎటువంటి కాగితాలతో సంబంధం లేకుండా తెరవచ్చుని పీఎఫ్‌ఆర్‌డీఏ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపాయి.
క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాను తెరిచే వెబ్‌పేజ్‌కు వెళ్లొచ్చు. ఫోటో, ఇతర వివరాలను డిజిలాకర్ నుంచి పొందడం కోసం ఆధార్ నెంబర్‌ను నింపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగంగా, సరళంగా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.