Tuesday, November 26, 2024

నాజుకైన రూపం కోసం యోగా – జాన్వీక‌పూర్

గ్లామ‌ర్ తో పాటు నాజుకైనా రూపాన్ని కాపాడుకోవాలంటే ఎంతో క‌ఠిన‌మైన యోగా ఆస‌నాలు వేయాల్సిందే అంటోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్. కాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తాను వేసిన యోగా ఆస‌నాల ఫొటోల‌ని పంచుకుందీ జాన్వీక‌పూర్. ఈ ఫొటోల్లో చాలా కఠినమైన యోగాసనంలో కూర్చుంది. బాడీ స్ట్రెచింగ్ పోజులో ఆకట్టుకుంటోంది. అలాగే మరో పిక్ లో జాన్వీ వెయిట్ బ్యాలన్స్ చేస్తూ కనిపించింది. ఇలా ప్రతి రోజూ యోగా చేస్తుందని ..యోగాసనాలు వేయాల్సిందేనని చెబుతోంది జాన్వీ. యోగాసనాలతో పాటు మే నెల ఎలా గడిచిపోతుందో అందుకు సంబంధించిన పిక్స్ ను కూడా పంచుకుందీ. ఉదయం యోగా చేయడం.. ఆ తర్వాత బెస్ట్ అవుట్ ఫిట్ ను ధరించి ఫొటోషూట్స్ చేయడం.. మిగిలిన సమయంలో ఇంట్లోనే వర్క్ చేసుకుంటుంద‌ట‌. ఈ ఫొటోల‌తో పాటు జాన్వీ కపూర్ తన గ్లామర్ పిక్స్ ను కూడా పంచుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీపై బజ్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement