Friday, October 18, 2024

Yoga For Space – తొలిసారి వ్యోమగాముల యోగాసనాలు … అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రేర్ ఫీట్

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రేర్ ఫీట్
యోగా ఫర్ స్పేస్ పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం
శ్రీనగర్‌లో భారీ కార్యక్రమం
హాజ‌రుకానున్న ప్ర‌ధాని మోదీతో పాటు శాస్త్ర‌వేత్త‌లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు తొలిసారిగా వ్యోమగాములు కూడా యోగాసనాలు వేయనున్నారు. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు.

- Advertisement -

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ కార్యక్రమం జరగనుంది. దీనిలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆరోజు వేలాది మంది యోగాభ్యాసకులతో పాటు ప్రధాని మోదీ కూడా యోగాసనాలు వేయనున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ఆయుష్ సెక్రటరీ రాజేష్ కోటేచా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో యోగా దినోత్సవం నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పిందని తెలిపారు. 2015లో 35,985 మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రాజ్‌పథ్‌లో యోగా చేశారు. ఈ యోగా సెషన్‌లో మొత్తం 84 దేశాలు పాల్గొన్నాయి.

2015లో రాజస్థాన్‌లోని కోటాలో 1.05 లక్షల మంది ఒకేసారి యోగా సాధన చేశారు. 2023లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రపంచంలోని 23.4 కోట్ల మంది పాల్గొన్నారు. దృష్టిలోపం కలిగినవారు యోగాను సులభంగా నేర్చుకోవడానికి ఇటీవల బ్రెయిలీ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అలాగే ‘ప్రొఫెసర్ ఆయుష్మాన్’ పేరుతో పిల్లలు యోగాసనాలు నేర్చుకునేందుకు కామిక్ పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement