డిష్ టీవీలో ఉన్న 25.6 శాతం వాటాను విక్రయించేందుకు యస్ బ్యాంకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. లోన్ రికవరీలో భాగంగా డిష్ టీవీలో ఈ వాటాను యస్ బ్యాంకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తోటి శాటిలైట్ డిష్ టీవీ కంపెనీలతో యస్ బ్యాంకు చర్చలు కూడా ప్రారంభించింది. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ రూ.14కోట్ల ఆదాయాన్ని గడించింది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను ప్రకటించింది. డిష్ టీవీ మార్కెట్ విలువ రూ.8,268 కోట్లుగా ఉంది. అయితే యస్ బ్యాంకు విక్రయించే డిష్ టీవీ వాటాను దక్కించుకునేందుకు ప్రముఖ శాటిలైట్ సంస్థలు అయిన టాటా స్కై, భారతీ ఎయిర్‌టెల్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఇవి రెండు ముందు వరుసలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : సుబ్రతా రాయ్‌కు బ్రెయిన్ సర్జరీ.. సక్సెస్ ఫుల్ గా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..
డిష్ టీవీ, యస్ బ్యాంకు మధ్య గత కొద్ది రోజుల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. డిష్ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఫ్యామిలీ చూసుకుంటున్నది. వీరికి కంపెనీలో 6శాతం వాటా ఉంది. ఒక వేళ యస్ బ్యాంకు డిష్ టీవీ వాటాను టాటా స్కై, ఎయిర్‌టెల్‌కు విక్రయిస్తే.. వీటి వాటా పెరగనుంది. శాటిలైట్ డిష్ టీవీ మార్కెట్లో 88 శాతంతో టాటా స్కై టాప్‌లో ఉంది. ఎయిర్‌టెల్, డిష్ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఒకటి.. రెండు రోజుల్లో డిష్ టీవీ వాటా అమ్మకాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital